గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గల శ్రీ ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆది శంకరాచార్య దేవాలయ ఏర్పాటుకు కృష్ణా నది ఒడ్డున స్థలం కేటాయించాలని కోరారు.