కామారెడ్డి డిపోలో రేపటి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. RTC జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కార్మికులు విధులను బహిష్కరించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె వల్ల డిపోకు చెందిన 129 బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశo ఉంది.