దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ వార్తలను ఖండించింది. సామాన్యులపై ఇంధన భారాన్ని మోపే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇంధన ధరల పెంపుపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని తేల్చిచెప్పింది. ఎవరైనా ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.