KRNL: క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేస్తూ పోటీల్లో సత్తా చాటాలని సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో శాప్ లీగ్ ఫుట్బాల్ ఎంపిక పోటీలను ఇవాళ ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సీఈవో రమణ, తదితరులు పాల్గొన్నారు.