WGL: వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కాలేజీల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, ర్యాగింగ్ ఘటనలపై పునరువృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.