W.G: ఆకివీడులో వేసవి ముందే అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. రోజుకు 15 సార్లు సరఫరా నిలుస్తుండటంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు కోతలు లేవంటున్నా, ప్రతి గంటకు అంతరాయం కలుగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. లైన్మెన్లు సరిగా స్పందించడం లేదని, తక్షణమే విద్యుత్ సమస్యను పరిష్కరించి నిరంతర సరఫరా అందించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.