SRCL: వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, పాదచారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.