ADB: జొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను బైంసా ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లో జొన్నల కొనుగోలు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వేసవికాలం నేపథ్యంలో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు.