MNCL: సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టు వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తొలగించిన కార్మికులందరినీ యధావిధిగా పాత పద్ధతిలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.