NDL: ABN, ఆంధ్రజ్యోతి సంస్థల MD రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ తన మీడియాలో చేసిన వ్యాఖ్యలు అత్యంత అవహేళనకరంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రాధాకృష్ణపై శుక్రవారం ఆత్మకూరు PSలో వైసీపీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను వెన్నుముక్క లేనివారిగా అభివర్ణించడం మీడియా స్థాయిలో ఉన్న వ్యక్తులకు తగదన్నారు.