వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో విలన్ పాత్ర కోసం ‘ధురంధర్ 2’ ఫేమ్ ఉదయ్ వీర్ సింధును మేకర్స్ ఎంపిక చేశారట. పలువురిని పరిశీలించిన తర్వాత, చివరకు మేకర్స్ ఉదయ్ వీర్నే ఫైనల్ చేసినట్లు సమాచారం.