ADB: ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామ అటవీ ప్రాంతంలో జింకల గుంపు కనువిందు చేసింది. శనివారం ఉదయం జున్నీ అటవీ ప్రాంతంలో జింకలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ దృశ్యాన్ని సమీప బీట్ ఆఫీసర్ బైరు బాయి తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు. అడవులు, వన్యప్రాణులు మనిషి మనుగడకు జీవనాధారం అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె అన్నారు.