TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కోల్కతా వెళ్లే స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బోర్డింగ్ తర్వాత అధికారులు ప్రయాణికులను దించేశారు. దీంతో ఎయిర్ పోర్టులో ప్రయాణికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.