SRD: మునిపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహా ర్యాలీ వాల్ పోస్టర్ నేడు ఆవిష్కరించారు. డా.BR అంబేడ్కర్, 135వ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో ఏప్రిల్ 14న నిర్వహించే భారీ మహా ర్యాలీకి బహుజనులు పెద్ద ఎత్తున తరలిరావాలని కార్యదర్శి గోపులారం పాండు కోరారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, భాస్కర్, విజయ్, నాగేష్, శివకుమార్, అశోక్ పాల్గొన్నారు.