ADB: నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బేల మండలంలోని సదల్పూర్ గ్రామస్తులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. వేసవికాలంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు స్వామి, రామన్న తదితరులున్నారు.