NRPT: జిల్లాలో పోలీస్ శాఖ వినూత్నంగా స్పందిస్తోంది. బాధితులు స్టేషన్ చుట్టూ తిరగకుండా, ఘటన స్థలంలోనే (On-site) FIR నమోదు చేసే విధానాన్ని ఎస్పీ డాక్టర్ వినీత్ IPS అమలు చేస్తున్నారు. నారాయణపేట, దామరగిద్ద ఘటనల్లో తక్షణమే FIRలు నమోదు చేసి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల కష్టాలకు స్పందించడమే తమ బాధ్యతని పేర్కొన్నారు.