WGL: కిష్టాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ తోట సోమనర్సయ్య, వార్డ్ సభ్యులు ఈదనూరి కళ్యాణి, గిద్ద రజిత, చివన బోయిన పద్మ, కునుసోత్ జ్యోతి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని ఝాన్సీ రెడ్డి పేర్కొన్నారు.