KMM: కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో శనివారం ఓ మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేప దొరకడం అరుదని, దీని ధర మార్కెట్లో కిలోకు రూ. 80 నుంచి రూ. 120 వరకు ఉంటుందని మత్స్యకారుడు హర్షం వ్యక్తం చేశారు. కిష్టాపురం గ్రామానికి చెందిన జూలూరి రాములు ఉదయం చేపల వేటకు వెళ్లగా, ఆయన వలలో 15 కేజీల పంకజ జెల్ల పడింది.