KMM: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొని, జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.