TG: సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలకు బ్రేక్ పడింది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.