అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.15కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు పోస్టర్ షేర్ చేశారు. అటు ఓవర్సీస్లో కూడా 575K డాలర్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇక షానీల్ డియో ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.