MBNR: దేవరకద్ర మున్సిపల్ కేంద్రంలోని గొర్రెల సంతకు శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం పాట ముగిసింది. సుమారు 25 మంది అభ్యర్థులు డిపాజిట్లు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంలో రామోజీ అనే వ్యక్తి అత్యధికంగా రూ.16.97 లక్షలు పాడి సంతను దక్కించుకున్నారు. మున్సిపల్ కమిషనర్, ఛైర్పర్సన్ పర్యవేక్షణలో వేలం ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది.