BDK: భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి విశేష పూజలు చేసిన అనంతరం, బేడా మండపంలో సీతారాములకు వేద మంత్రాల మధ్య కళ్యాణ తంతు పూర్తి చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.