TG: పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టి, ప్రియురాలి శరీరంలోకి బలవంతంగా HIV సోకిన రక్తాన్ని ఎక్కించాడు ఓ కిరాతకుడు. ఆ ద్రోహాన్ని, అనారోగ్యాన్ని తట్టుకోలేక పోచారం ఐటీ కారిడార్‌కు చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల జరిగిన ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు విడవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.