KKR vs LSG మధ్య జరిగిన మ్యాచ్లోనూ అంపైర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్ల తప్పిదం కారణంగా KKR విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్(9) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ఇలాంటి చెత్త అంపైరింగ్ ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు అభిమానులు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు.