NDL: బేతంచెర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజలు ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ వనిత లక్ష్మి కోరారు. ప్రజలు దళారుల సహాయం లేకుండానే నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకుని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా వివరాలు అందజేస్తామన్నారు.