తొలి భార్య రీనా దత్తాతో విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను అమీర్ ఖాన్ పంచుకున్నాడు. ఆ బాధను తట్టుకోలేక సుమారు ఒకటిన్నర ఏళ్ల పాటు మద్యానికి బానిసైనట్లు, ప్రతిరోజూ రాత్రి తాగేవాడినని వెల్లడించాడు. అలవాటు లేని వ్యక్తి ఒకేసారి అంతలా వ్యసనానికి లోనవడం ప్రమాదకరమని, అయితే పట్టుదలతో ఆ అలవాటు నుంచి బయటపడ్డానని పేర్కొన్నాడు.