BHPL: ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా గణపురంలోని కోటగుళ్లను కమలాపూర్ MJP గురుకుల పాఠశాల విద్యార్థులు సందర్శించారు. కోటగుళ్ల విశిష్టత, ప్రాముఖ్యతను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఆలయానికి విచ్చేసిన విద్యార్థులకు అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు. సుమారు 800 మంది విద్యార్థులు ఆలయాన్ని సందర్శించారు.