NRML: కాలభైరవ అష్టమి సందర్భంగా చింతకుంట వాడ కాలభైరవ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పూజా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు విజయలక్ష్మి పోశెట్టి, ఎస్పీ రాజు, గోపు గోపి, ఆకుల రామకృష్ణ, లక్కాకుల హరీష్, రమణ, తదితరులు పాల్గొన్నారు.