దర్శకుడు అనిల్ రావిపూడి యానిమేషన్ విభాగంలోకి అడుగుపెట్టబోతున్నాడట. రామాయణ గాథను యానిమేటెడ్ వెర్షన్లో తెరకెక్కించేందుకు KVN ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తోంది. ఆధునిక సాంకేతికతతో, భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ మూవీకి అనిల్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. వరుస హిట్లతో ఉన్న ఆయనకు ఇది విభిన్న ప్రయత్నమని సినీ వర్గాలు తెలిపాయి.