గుంటూరు నగరంలోని 56వ డివిజన్ పరిధిలోని మోతీలాల్ నగర్, రైల్వే భూములపై నివసిస్తున్న నిరుపేదల ఇళ్లను తొలగించబోతున్నారనే వార్తపై వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా స్పందించారు. పేద ప్రజల పక్షాన నిలిచిన ఆమె, బాధిత కుటుంబాలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌ను స్వయంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.