SRD: యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి యోగా కేంద్రంలో గురువారం యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యశాఖ సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు పాల్గొన్నారు.