NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి శుక్రవారం ఆయన రూ. 1,00,000 ల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు రాజగోపాల్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.