HNK: హుస్నాబాద్ పశువైద్యశాలకు, హనుమకొండ జిల్లాలోని ముల్కనూరు పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. పశుపోషక రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నూతన భవన నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.