ASR: యోగాంధ్ర ఉద్యమం-2026లో భాగంగా ఈనెల 8న హుకుంపేట మండలం మత్స్యగుండం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈమేరకు జాయింట్ కలెక్టర్ శ్రీపూజ మంగళవారం అధికారులతో కలిసి మత్స్యగుండం వద్ద యోగా ఏర్పాట్లను పరిశీలించారు. యోగాంధ్ర ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.