TGలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై TPCC నేత సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. APలో ‘జనసేన’గా ఉన్న ఆ పార్టీ.. TGలో మాత్రం BJP ‘భజనసేన’గా మారిపోయిందన్నారు. TGలో నిరుద్యోగంపై పోరాడతామంటున్న పవన్‌కు.. కేంద్రంలో నిరుద్యోగం, పేపర్ లీకులు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ జాతికి అమ్మలా ఆదరించడం.. కుట్రలను అమ్మోరులా దహించడమూ తెలుసన్నారు.