SRD: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4,6,8,10 తేదీలలో జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సభల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.