TG: 2029 సాధారణ ఎన్నికల్లో జనసేన తప్పకుండా తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో BJP తమతో కలిసి వస్తుందో లేదో తెలియదన్నారు. తాను వ్యక్తిగతంగా ఇక్కడ పోటీ చేయబోనని, జనసేన అభ్యర్థులు గెలిస్తే చాలని అన్నారు. త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.