MDCL: ఉప్పల్‌లోని ముదిరాజ్ సంఘ భవనానికి కొత్త ఊపిరి లభించింది. రూ.62 లక్షల నిధులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్‌రెడ్డి పనులను పర్యవేక్షించారు. కమ్యూనిటీ హాళ్లు, పెండింగ్ పనులు పూర్తి చేస్తూ భవనాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతున్నారు.