తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. గోవింద నామస్మరణలతో తిరుపతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.