KDP: తొండూరు(M) భద్రంపల్లి గ్రామంలో సుమారు 500 సంవత్సరాల నాటి భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. చెట్టు కూలడంతో అక్కడ నిలిపి ఉంచిన ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. రహదారిపై చెట్టు పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.