SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలోకి ఈతకు వెళ్లిన గంగిరెడ్డి సాయికుమార్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఫైర్ రెస్క్యూ బృందం మోటార్లతో బావిలోని నీటిని బయటకు తోడి, రెండు గంటల పాటు శ్రమించి సాయికుమార్ మృతదేహాన్ని వెలికితీసింది.