WNP: వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు నిర్దేశించిన వాహనాలు సమకూర్చకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వారం రోజులు ధాన్యం వేగంగా తరలించడానికి కొనుగోలు కేంద్రాల్లో కావాల్సినన్ని లారీలు అందుబాటులో ఉంచాలన్నారు.