తూ.గో: పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు కలెక్టర్ కీర్తి చేకూరి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, సేవాభావానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, మానవతా విలువలను మరింత బలోపేతం చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలన్నారు.