WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కల సాకారమవుతోందని ఆయన తెలిపారు.