ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్, సరికొత్త ‘అవెంజర్ స్ట్రీట్ 220’ బైక్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.30 లక్షలు. ఇది ఎబోనీ బ్లాక్, కాక్టెయిల్ రెడ్ వైన్ రంగుల్లో లభిస్తుంది. ఇందులో పవర్ఫుల్ 220cc ఇంజిన్, 5-స్పీడ్ గేర్బాక్స్, సింగిల్ ఛానెల్ ABS, 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.