SS: నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామంలో తిరుపతి రమాదేవి హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.