SS: పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు హెచ్.ఎన్.ఎస్.ఎస్ ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించే ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్షించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో భూసేకరణ, పెగ్ మార్కింగ్, సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్లో ఉన్న సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.