TG: ప్రజా గాయకుడు గద్దర్ బతికున్న రోజుల్లో ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఎక్కడున్నారని పవన్ ప్రశ్నించారు. ‘శరీరంలో బుల్లెట్లు దిగాయి, సరిగ్గా నడవలేకపోతున్నాను. ఓ అన్నగా అడుగుతున్నా తమ్మి.. ఓ కారు కొనివ్వు’అని గద్దర్ అడిగితే.. 3 రోజుల్లో కొనిచ్చా. తెలంగాణకు అన్యాయం చేసిన పాలకులను ఉరితీసినా తప్పులేదు. పాలకులను తిట్టాలి తప్ప ప్రజలను కాదు’ అని పవన్ హితవు పలికారు.