NLG: అబద్దాలతో, బూటకపు హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా మంగళవారం చండూరు పట్టణ కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు, కోట్లాది ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితం అని అన్నారు.